VIDEO: కంటి ఆరోగ్యంపై అవగాహన ర్యాలీ
NRML: నవంబర్ 9 కంటి దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం నిర్మల్ పట్టణంలో ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు, ఆశా కార్యకర్తలు కంటి ఆరోగ్య అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ సురేష్ మాట్లాడుతూ.. కంటి ఆరోగ్యానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ప్రతి ఒక్కరు తమ కండ్లను ఆరోగ్యంగా ఉంచుకోవాలని, ఏవైనా సమస్యలు ఏర్పడితే వెంటనే వైద్యులను సంప్రదించాలన్నారు.