"మన ఇసుక వాహనం యాప్" ద్వారానే ఇసుక అనుమతులు
NRML: జిల్లాలో ఇసుక అమ్మకాల అనుమతులు ఇకపై “మన ఇసుక వాహనం” యాప్ ద్వారానే ఇవ్వాలని కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదేశించారు. భూభారతి పెండింగ్ దరఖాస్తులను తక్షణమే పరిష్కరించాలని, పౌర సేవల సర్టిఫికెట్లు ఆలస్యం లేకుండా జారీ చేయాలని తెలిపారు. రెవెన్యూ అంశాలపై మంగళవారం జరిగిన సమీక్షలో అధికారులకు కలెక్టర్ ఈ సూచనలు చేశారు.