నిడమానూరులో వైభవంగా ఈస్టర్ పండుగ
NLG: నిడమానూరు మండల కేంద్రంతో పాటు వేంపాడులో ఈస్టర్ వేడుకలు వైభవంగా జరిగాయి. ఏపీపీఆర్ఎ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. క్రీస్తు పునరుత్థానాన్ని పురస్కరించుకుని పాస్టర్ పాల్ రాజు ఆధ్వర్యంలో భక్తులు దైవ కృప కోసం వేడుకున్నారు. కులమతాలకు అతీతంగా పెద్దలు, యువకులు ఈ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.