పంచాయతీ భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

పంచాయతీ భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

BDK: కరకగూడెం మండలం రఘునాథపాలెం గ్రామపంచాయతీలో రూ.20 లక్షల అంచనా వ్యయంతో నిర్మించిన గ్రామపంచాయతీ భవనాన్ని సోమవారం ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పంచాయతీ భవన నిర్మాణంతో ప్రజలకు సేవలు మరింత చేరువవుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.