బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతపై కేసు
TG: జూబ్లీహిల్స్ BRS అభ్యర్థి మాగంటి సునీతపై బోరబండ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. కాంగ్రెస్ మీడియా, కమ్యూనికేషన్ ఛైర్మన్ మోహన్‌రెడ్డి ఆమెపై ROకు ఫిర్యాదు చేశారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కారు గుర్తు ఉండే ఓటర్ స్లిప్‌లు పంపిణీ చేస్తున్నారని అందులో పేర్కొన్నారు. ఈ మేరకు సునీతపై బోరబండ పోలీసులు కేసు నమోదు చేశారు.