ఉపాధ్యాయ, ఉద్యోగులకు అండగా ఉంటా: ఎమ్మెల్యే

ఉపాధ్యాయ, ఉద్యోగులకు అండగా ఉంటా: ఎమ్మెల్యే

సూర్యాపేట: ఉపాధ్యాయ, ఉద్యోగులకు అండగా ఉంటానని, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే సామేలు అన్నారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా నాగారం మండలంలోని ఆనంద గార్డెన్‌లో ఎమ్మెల్యే సామేలుకు నియోజకవర్గ ఉపాధ్యాయ, ఉద్యోగుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొని మాట్లాడారు. తన గెలుపులో ఉపాధ్యాయులు, ఉద్యోగులు ఎంతో కృషి చేశారని కొనియాడారు.