జాతీయస్థాయి పోటీలకు గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థులు
MHBD: గూడూరు ప్రభుత్వ గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాల విద్యార్థులు క్రీడల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచారు. అండర్-14 విభాగంలో కున్సోత్ నందిని, జాటోత్ హైమావతి, వాంకుడోత్ చైతన్య కబడ్డీ, షార్ట్ పుట్ క్రీడల్లో రాష్ట్రస్థాయిలో తమ సత్తాచాటి, జాతీయ స్థాయి క్రీడలకు ఎంపికైనట్లు హెడ్మాస్టర్ అమృత తెలిపారు. క్రీడల్లో రాణించిన విద్యార్థులను పాఠశాల ఉపాధ్యాయుల బృందం అభినందించారు.