'ఎంపీ ల్యాడ్స్ నిధులు విడుదల చేయాలి'
MNCL: మంచిర్యాల ప్రభుత్వ వైద్య కళాశాల విద్యార్థులు, అధ్యాపక సిబ్బందికి రవాణా సదుపాయాలను మెరుగుపరచడానికి పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా రెండు బస్సుల కొనుగోలుకు ఎంపీ ల్యాడ్స్ నిధుల నుంచి రూ.80 లక్షలు మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్‌కు ఎంపీ లేఖ సమర్పించారు. నిధుల మంజూరు, విడుదల ప్రక్రియను త్వరగా ప్రారంభించాలని కోరారు.