డంప్ యార్డును తొలగించాలని వినాయకుడికి విన్నపం
KNR: డంప్ యార్డు సమస్యపై స్థానికులు, సామాజిక కార్యకర్తలు వినూత్నంగా నిరసన తెలిపారు. చెత్త కుప్పల నుంచి వెలువడుతున్న కాలుష్యంతో చిన్నారులు, వృద్ధులు తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఫలితం లేకపోవడంతో, చివరకు తమ గోడును ఆలకించాలంటూ స్వయంగా గిద్దపెర్మన్ల దేవాలయంలోని వినతి పత్రం అందజేశారు.