బీటెక్ రవి తమ్ముడిపై కేసు నమోదు

KDP: పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల ప్రచారంలో ఉద్రిక్తత నెలకొన్న విషయం తెలిసిందే. నల్లగొండవారిపల్లెలో ప్రచారానికి వెళ్లిన వైసీపీ ఎమ్మెల్సీ రమేశ్, రాముపై దాడి జరిగింది. ఈ ఘటనలో వాహనాలు సైతం ధ్వంసమయ్యాయి. దీంతో పోలీసులు చర్యలకు ఉపక్రమించారు. వైసీపీ నేత రాము ఫిర్యాదుతో బీటెక్ రవి తమ్ముడి పాటుగా 25 మందిపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు.