నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం
ASF: బెజ్జూర్ మండల కేంద్రంలోని 33/11 KV సబ్ స్టేషన్‌లో మరమ్మతుల కారణంగా సోమవారం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 4 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏఈ అంజల్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. దీంతో సబ్ స్టేషన్ పరిధిలో విద్యుత్ సరఫరా నిలిపి వేస్తున్నట్లు AE తెలిపారు. వినియోగదారులు సహకరించాలని అయన కోరారు.