VIDEO: సుంకేసుల రిజర్వాయర్‌కు భారీ వరద.. గేట్లు ఎత్తివేత

VIDEO: సుంకేసుల రిజర్వాయర్‌కు భారీ వరద.. గేట్లు ఎత్తివేత

KRNL: కోడుమూరు నియోజకవర్గంలోని సుంకేసుల రిజర్వాయర్‌కు భారీగా వరద ప్రవాహం వస్తోంది. ఇవాళ 78,000 క్యూసెక్కుల నీరు జలశయంలోకి చేరుతోందని, దీంతో 18 గేట్లను ఎత్తి 75,096 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారని అధికారులు తెలిపారు. ప్రస్తుతం జలాశయంలో 0.881 TMC ల నీరు నిల్వ ఉందని, KC కెనాల్‌కు 2180 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారని పేర్కొన్నారు.