భూభారతి సదస్సులో రైతు ఆత్మహత్యాయత్నం

TG: సూర్యాపేట చింతలపాలెంలో భూభారతి అవగాహన సదస్సులో నాగరాజు అనే రైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తన భూమి కబ్జాకు గురైందని చెప్పినా అధికారులు పట్టించుకోలేదని పెట్రోల్ పోసుకునేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. అక్కడే మరో మహిళా రైతు పురుగుల మందుతో బెదిరించడంతో ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. భూసమస్యలపై అధికారుల నిర్లక్ష్యం కారణంగానే రైతుల నిరసనలు తీవ్రమయ్యాయి.