ఇబ్రహీంపట్నంలో రోడ్డు ప్రమాదం

RR: ఇబ్రహీంపట్నం చెరువు కట్టపై మంగళవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. కట్టెల లోడుతో వెళ్తున్న లారీ బోల్తా పడింది. చెరువు కట్ట నుంచి యూటర్న్ చేస్తున్న క్రమంలో ఓవర్ లోడ్ కారణంగా ఒక్కసారిగా బోల్తా పడినట్లు స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో గాయపడ్డ డ్రైవర్‌కు IBP గవర్నమెంట్ హాస్పిటల్‌కు తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు.