VIDEO: మాగుంట లే అవుట్‌లో శ్రీ సుదర్శన నరసింహ హోమం
నెల్లూరు నగరంలోని మాగుంట లే అవుట్ శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో ఆదివారం స్వాతి నక్షత్రం పర్వదినం సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అభిషేకం, ప్రత్యేక పుష్పాలంకరణ, శ్రీ సుదర్శన నరసింహ హోమం వేద పండితులు మంత్రోచ్ఛారణలు మధ్య జరిగాయి. భక్తులు విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. తదుపరి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు.