స్వామిత్వ సర్వేపై డిప్యూటీ ఎంపీడీవో సమీక్ష

స్వామిత్వ సర్వేపై డిప్యూటీ ఎంపీడీవో సమీక్ష

AKP: ఎస్. రాయవరం మండలం పెదగుమ్ములూరు, కొరుప్రోలు భీమవరం గ్రామాల్లో జరుగుతున్న స్వామిత్వ సర్వేపై డిప్యూటీ ఎంపీడీవో బంగారు సత్యనారాయణ ఆదివారం పంచాయతీ కార్యదర్శులతో సమీక్ష నిర్వహించారు. ప్రతి ఇల్లు, ఖాళీ స్థలాలను శాస్త్రీయ పద్ధతుల్లో కొలతలు వేసి నమోదు చేయాలన్నారు. అనంతరం సంబంధిత గృహ యజమానులకు హక్కు పత్రాలను అందజేస్తామని తెలపారు.