విద్యుత్ షాక్‌తో బాలుడు మృతి

విద్యుత్ షాక్‌తో బాలుడు మృతి

KRNL: ఎమ్మిగనూరు పట్టణంలో గురువారం ఎలుకలు తెంపిన విద్యుత్ వైర్ల కారణంగా 13 ఏళ్ల గోపికృష్ణ అనే బాలుడు విద్యుత్ షాక్‌తో మృతి చెందాడు. ఎద్దుల మార్కెట్ సమీపంలోని కిరాణం దుకాణంలో సరుకులు ఇస్తుండగా, కిందపడి ఉన్న తెగిన వైర్‌ను గమనించక తొక్కిన బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.