నదిలో దిగి మత్స్యకారుడు గల్లంతు

నదిలో దిగి మత్స్యకారుడు గల్లంతు

VZM: నదిలో స్నానానికి దిగిన ఓ మత్స్యకారుడు గల్లంతైన ఘటన రేగిడి మండలంలో చోటు చేసుకుంది. తునివాడ గ్రామానికి చెందిన లక్ష్మణరావు చేపల వేట ముగించుకుని నదిలో స్నానానికి దిగాడు. నీటి ప్రవాహం ఉధృతంగా ఉండటంతో గల్లంతయ్యాడు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.