బ్యాడ్మింటన్ టోర్నీలో తూప్రాన్ యువకుల ప్రతిభ.!

బ్యాడ్మింటన్ టోర్నీలో తూప్రాన్ యువకుల ప్రతిభ.!

MDK: కొంపల్లిలోని షోర్ లైన్ స్పోర్ట్స్ హబ్‌లో శనివారం నిర్వహించిన బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో తూప్రాన్‌కు చెందిన యువకులు సత్తా చాటారు. హైదరాబాద్ జంట నగరాలతో పాటు వివిధ జిల్లాల నుంచి పాల్గొన్న ఈ టోర్నమెంట్‌లో కాస భరత్ కుమార్, సాటుకూరి భానుచందర్ ద్వితీయ బహుమతిని కైవసం చేసుకున్నారు. నిర్వాహకులు వారికి బహుమతులతో పాటు నగదును అందజేశారు.