పొన్నలూరులో ఆరోగ్య సిబ్బందితో సమావేశం

ప్రకాశం: పొన్నలూరు ఆరోగ్య కేంద్రంలో మంగళవారం ఆరోగ్య సిబ్బందితో ఒంగోలు డీటీసీపీ శ్రీవాణి పలు ఆరోగ్య అంశాలపై సమావేశం నిర్వహించారు. ఫ్రంట్ లైన్ వారియర్స్‌గా ఉన్న ఆరోగ్య సిబ్బంది మొదటగా అన్ని రకాల ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలన్నారు. అలాగే గ్రామాల్లో క్షయ, కుష్టు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులను గుర్తించి వారికి తగిన ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, కావాల్సిన మందులు అందించలన్నారు.