కాంగ్రెస్, బీజేపీ మ్యానిఫెస్టోల విడుదల

కాంగ్రెస్, బీజేపీ మ్యానిఫెస్టోల విడుదల

పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్, బీజేపీ పార్టీలు మ్యానిఫెస్టోలను విడుదల చేశాయి. ప్రాథమిక, ఉన్నత విద్యలను అందరికీ ఉచితంగా అందిస్తామని, రేషన్ కార్డులకు నెలకు రూ.2,500 విలువైన సరకులను ఉచితంగా ఇస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. ప్లస్‌టూలో రాణించే విద్యార్థులకు ఉచిత ఈ-స్కూటర్, పండగ సమయాల్లో ఉచితంగా రెండు గ్యాస్ సిలిండర్లు ఇస్తామని బీజేపీ వెల్లడించింది.