ఒక్క మలుపు… రాష్ట్రం మారిపోతుంది..!
గద్వాల జిల్లా ఉండవల్లి మండలంలోని భైరాపురం వద్ద మతిమరిస్తే రాష్ట్రాలే వేరయ్యే పరిస్థితులు నెలకొన్నాయి. అయితే రెండు దారుల్లో ఒక దారి తెలంగాణలోని చివరి గ్రామమైన బస్వాపురానికి వెళ్తుంది. మరోక దారి ఏపీలోని మొదటి గ్రామమైన పంచలింగాలకు వెళ్తుంది. అధికారులు సూచిక బోర్డులు ఏర్పాటు చేయకపోడంతో ప్రయాణికులు ఈ ఇబ్బందులను ఎదుర్కుంటున్నారు.