సిబ్బంది రోజువారీ విధులపై సీఐ సూచనలు

సిబ్బంది రోజువారీ విధులపై సీఐ సూచనలు

VZM: జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ ఆదేశాలతో జిల్లాలో ఉన్న అన్ని పోలీసు స్టేషన్‌లలో రోల్ కాల్ ఉదయం, సాయంత్రం నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా కొత్తవలస పోలీసు స్టేషన్‌లో సోమవారం సాయంత్రం సీఐ షణ్ముఖరావు, ఎస్సై ప్రసాదరావు ఆధ్వర్యంలో రోల్ కాల్ కార్యక్రమం నిర్వహించారు. పోలీసు స్టేషన్ పరిధిలో రోజూవారీ విధులపై చేపట్టవలసిన విధులపై సీఐ సిబ్బందికి సూచించారు.