VIDEO: దేవరకొండలో వైభవంగా కనకరుద్రమ్మ తిరుణాల
అన్నమయ్య: పుల్లంపేట మండలం పీవీజీ పల్లి పంచాయతీ దేవరకొండలో సోమవారం పౌర్ణమి సందర్భంగా శ్రీ కనకరుద్రమ్మ తల్లి తిరుణాల అత్యంత వైభవంగా జరుగుతోంది. అమ్మలగన్న అమ్మ కనకరుద్రమ్మను దర్శించుకునేందుకు వేలాది మంది భక్తులు తరలివచ్చారు. ఉదయం నుండే భక్తులు ప్రత్యేక పూజలు, మొక్కులు తీర్చుకుంటున్నారు. జాతర సందర్భంగా ఆలయ ప్రాంగణం భక్తిశ్రద్ధలతో మార్మోగుతోంది.