శ్రీరాముడి ఉత్సవాలన్నీ ఆ ముహూర్తంలోనే ఎందుకు?
అయోధ్య రామమందిరంలో ఇవాళ అంగరంగ వైభవంగా ధ్వజారోహణం నిర్వహించారు. ఈ కార్యక్రమం అభిజిత్ ముహూర్తంలో జరిగింది. దీంతో అసలు శ్రీరాముడి ఉత్సవాలన్నీ అభిజిత్ ముహూర్తంలోనే ఎందుకు జరుగుతాయనే ప్రశ్న తలెత్తుతుంది. సూర్యోదయం నుంచి వచ్చే నాలుగో ముహుర్తమే అభిజిత్ ముహూర్తం. శాస్త్రం ప్రకారం ఈ సమయంలో 21 దోషాలు పనిచేయవు. అందుకనే శ్రీరాముడి ఉత్సవాల్ని ఈ టైంలో చేస్తారు.