మాజీ మంత్రి హరీష్ రావు విడుదల
TG: HYD శంషాబాద్ పీఎస్ నుంచి మాజీ మంత్రి హరీష్ రావు విడుదలయ్యారు. మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావులతో సహా BRS నేతలు సైతం విడుదలయ్యారు. అంతకముందు శంషాబాద్ పీఎస్ ఎదుట బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన చేశాయి. కాగా, పరిగిలో రైతులకు మద్దతుగా వెళ్తుండగా.. బీఆర్ఎస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.