కేజ్రీవాల్‌కు ఢిల్లీ హైకోర్టు నోటీసులు

కేజ్రీవాల్‌కు ఢిల్లీ హైకోర్టు నోటీసులు

మద్యం పాలసీ కేసులో సమన్లకు గైర్హాజరైన వ్యవహారంలో ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను నిర్దోషిగా ప్రకటిస్తూ ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును ఈడీ సవాలు చేసింది. దీనిపై విచారణ జరిపిన ఢిల్లీ హైకోర్టు.. కేజ్రీవాల్‌కు నోటీసులు జారీ చేసింది. జస్టిస్ స్వర్ణకాంత శర్మ ఈ కేసును ఈనెల 29కి వాయిదా వేశారు. కేజ్రీవాల్ ఉద్దేశపూర్వకంగానే సమన్లను ధిక్కరించారని ఈడీ ఆరోపించింది.