జిల్లా నుంచే కాంగ్రెస్ పతనం: జీవన్ రెడ్డి

జిల్లా నుంచే కాంగ్రెస్ పతనం: జీవన్ రెడ్డి

NZB: జిల్లా బీఆర్ఎస్ కంచుకోట అని, కాంగ్రెస్ పతనాన్ని నిజామాబాద్ గడ్డ నుంచే శాసిస్తామని ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు నిన్న ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. కేసీఆర్‌ను మూడోసారి ముఖ్యమంత్రి చేసేవరకు నిద్రబోమన్నారు. ఒంటరిగానే పోటీ చేసి వంద సీట్లతో మళ్లీ ప్రభుత్వం ఏర్పాటు చేసి అధికారంలో ఉంటామన్నారు.