రైలు ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మృతి

రైలు ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మృతి

ASR: అరకులోయ మండలంలోని ఐటీఐ ఎదురుగా ఉన్న రైల్వే పట్టాలపై గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన ఇవాళ చోటుచేసుకుంది. సుమారు 30 సంవత్సరాల వయస్సు గల వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. రైలు ఢీకొనడంతోనే అతడు మృతి చెందినట్లు స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారన్నారు.