హోరెత్తనున్న ఎన్నికల ప్రచారం
SDPT: గజ్వేల్ డివిజన్ పరిధిలోని ఏడు మండలాల్లోని గ్రామాల్లో స్థానిక ఎన్నికల ప్రచారం నేటి నుంచి హోరెత్తనుంది. గజ్వేల్, దౌల్తాబాద్, రాయపోల్, ములుగు, వర్గల్, మర్కూక్, జగదేవపూర్ మండలాల పరిధిలోని ఆయా గ్రామాల్లో సర్పంచ్ అభ్యర్థులకు గుర్తులు కేటాయింపు పూర్తి కావడంతో డమ్మి సింబల్స్‌తో ప్రచారాన్ని నిర్వహించేందుకు వార్డు, సర్పంచ్ అభ్యర్థులు సిద్ధమయ్యారు.