పట్టిసీమకు పదేళ్లు పూర్తి

కృష్ణా: పట్టిసీమ ఎత్తిపోతల పథకం పదేళ్లు పూర్తి చేసుకుని కృష్ణా డెల్టాకు జీవనాడిగా మారింది. 2015లో కేవలం 89 రోజుల్లోనే 8.3 టీఎంసీల నీరు మళ్లించి రైతుల సాగు, తాగునీటి అవసరాలు తీర్చింది. తరువాత 2015-19లో 263 టీఎంసీలు, 2019-24లో 165 టీఎంసీలు, ఈ ఏడాది జులైకి 11.05 టీఎంసీలు చేరాయి. మొత్తంగా 439 టీఎంసీలను కృష్ణానదికి చేరవేసి రైతులకు అండగా నిలిచింది.