వెంకటాపురంలో రక్తదాన శిబిరం
MBNR: రక్తదానం చేసి ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారి ప్రాణాలు కాపాడాలని సర్పంచ్ నారాయణ అన్నారు. మహబూబ్‌నగర్ మండలం వెంకటాపురం గ్రామంలో డా. బీ.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా రక్తదాన శిబిరం నిర్వహించారు. అంబేద్కర్ ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ చైతన్యంగా ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువత పాల్గొన్నారు.