VIDEO: రోడ్డు తవ్వేయడంతో గ్రామస్తులు ఆవేదన
కృష్ణా: మోపిదేవి మండలం కొక్కిలిగడ్డ నుంచి బండికోళ్ల వెళ్లే లంక రోడ్డును తవ్వి వదిలేసారని బుధవారం గ్రామస్తులు వాపోయారు. నిత్యం ఈ రోడ్డుపై వాహనాలలో ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారని, రాత్రి సమయాలలో రోడ్డుపై రాళ్లు కనబడక ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని గ్రామస్తులు తెలిపారు. అధికారులు తక్షణమే స్పందించి ఈ రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలన్నారు.