VIDEO: బాట గంగమ్మ ఆలయంలో చోరీ
CTR: వీ.కోట బంగ్లా ఊరు బాట గంగమ్మ ఆలయంలో బుధవారం రాత్రి దొంగలు పడ్డారు. గుర్తు తెలియని వ్యక్తులు బాట గంగమ్మ దేవాలయంలో గేట్లు పగలగొట్టి లోపలికి చొరబడి హుండీలలో భక్తులు సమర్పించిన కానుకలను దోచుకెళ్లినట్లు గ్రామస్థులు తెలిపారు. గతంలో మూడుసార్లు ఇదే ఆలయంలో దొంగతనం జరిగిందని, ఇది నాలుగోసారని వాపోయారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.