VIDEO: అప్పనపల్లిలో ఘనంగా సిరిబొమ్మ తీర్థం

VIDEO: అప్పనపల్లిలో ఘనంగా సిరిబొమ్మ తీర్థం

కోనసీమ: అప్పనపల్లి గ్రామ దేవత శ్రీకనకమహలక్ష్మమ్మ జాతరలో భాగంగా బుధవారం సిరిబొమ్మ తీర్థం కనులపండువగా జరిగింది. సిరిబొమ్మను గాలిలో తిప్పుతుండగా భక్తులు అరటిపండ్లతో కొడుతూ సందడి చేశారు. అంతకుముందు డప్పు వాయిద్యాలతో సిరిబొమ్మను గ్రామ వీధుల్లో ఊరేగించారు. బాణసంచా కాల్పులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ వేడుకను వీక్షించేందుకు భారీగా భక్తులు తరలివచ్చారు.