కాంగ్రెస్‌పై బీజేపీ మండిపాటు

కాంగ్రెస్‌పై బీజేపీ మండిపాటు

బీహార్ ఎన్నికల్లో ఓటమికి కాంగ్రెస్ ప్రజలను నిందిస్తోందని బీజేపీ మండిపడింది. ఆత్మపరిశీల చేసుకోవాల్సింది పోయి కాంగ్రెస్ తమ రాకుమారుడికి రక్షణ కల్పించేందుకు ఓటర్లను బాధ్యులను చేస్తోందని ధ్వజమెత్తింది. రాహుల్ నాయకత్వంలో హస్తం పార్టీ 95 ఎన్నికల్లో ఓటమిని చవిచూసినా ఆయనను నిందించటంలేదని దుయ్యబట్టింది. రాహుల్ అసలు తప్పే చేయరు అన్నట్లు వ్యవహరిస్తుందని ఆగ్రహించింది.