'190 మంది ఉపాధ్యాయులకు పదోన్నతి'

SRD: ఎస్జిటి నుంచి స్కూల్ అసిస్టెంట్‌గా 190 మంది ఉపాధ్యాయులకు పదోన్నతి కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు ఆదివారం తెలిపారు. జాబితాలో పేర్లు ఉన్న ఉపాధ్యాయులు ఈనెల 25వ తేదీన వెబ్ ఆప్షన్ ద్వారా పాఠశాలను ఎంచుకోవాలని చెప్పారు. 26వ తేదీన కేటాయించిన పాఠశాలలో విధుల్లో చేరాలని పేర్కొన్నారు.