కాంగ్రెస్‌లో చేరిన బీజేపీ నాయకులు
ADB: ఉట్నూర్ మండల కేంద్రంలోని MLA క్యాంపు కార్యాలయంలో నిర్మల్ డీసీసీ అధ్యక్షుడు, ఖానాపూర్ MLA బొజ్జు ఆధ్వర్యంలో జన్నారం మండలం టీజీ పల్లి నుంచి పెర్క సంఘం మండల అధ్యక్షుడు, నాయకులు ఉపసర్పంచ్, వార్డ్ మెంబెర్స్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. MLA వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ప్రభుత్వం సంక్షేమ పథకాలను చూసి కాంగ్రెస్‌లో చేరామని వారు తెలిపారు.