బాల్య వివాహ నిర్మూలనకు ప్రపంచ సమైక్య ప్రతిజ్ఞ

BHNG: చౌటుప్పల్ మండలం నేలపట్ల గ్రామంలో హనుమాన్ టెంపుల్లో స్కోప్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్ సౌజన్యంతో బాల్య వివాహ నిర్మూలనకు ప్రపంచ సమైక్య ప్రతిజ్ఞ చేయించారు. ఈనెల 12 నుంచి 14వ తేదీ వరకు జిల్లాలోని హిందూ దేవాలయాలు, మసీదులు, చర్చిలలో నిర్వహిస్తున్న బాల్య వివాహాలు జరగకుండా చొరవ తీసుకోవాలని మండల కో- ఆర్డినేటర్ బి. నరసింహరాజు సూచించారు.