గంట తరబడి ఎదురుచూపులు..!

గంట తరబడి ఎదురుచూపులు..!

HYD: RTC కార్మికుల సమ్మె నేటితో 3వ రోజుకు చేరుకుంది. అయితే, నగరంలో సమ్మెకు ముందు ప్రతి పది నిమిషాలకు ఒక బస్సు ఉండేది. కాని, ప్రస్తుతం గంట దాటినా ఒక్క బస్సు రావడంలేదని ప్రయాణికులు వాపోతున్నారు. ఇదిలా ఉంటే దూర ప్రాంతాలకు వెళ్లే ప్రజలు, విద్యార్థులు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం త్వరగా ఒక నిర్ణయం తీసుకుని సమస్యకు పరిష్కారం చూపాలని కోరుతున్నారు.