రంజాన్ సందర్భంగా ఈద్గాను సందర్శించిన మంత్రి
WGL: ఖిలా వరంగల్‌లో రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులందరికీ ఇవాళ మంత్రి కొండా సురేఖ శుభాకాంక్షలు తెలిపారు. ఈ పవిత్ర నెల క్రమశిక్షణకు, దాతృత్వానికి ప్రతీకని మంత్రి కొనియాడారు. అల్లాహ్ ఆశీస్సులతో అందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని ప్రార్థిస్తున్నట్లు వెల్లడించారు. పండుగను సంతోషకర వాతావరణంలో జరుపుకోవాలని అన్నారు.