'న్యుమోనియా పట్ల అప్రమత్తంగా ఉండండి'
NLR: ఇందుకూరుపేట మండలం జంగంవాని దొరువు గ్రామపంచాయతీ పరిధిలో బుధవారం న్యుమోనియాపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా హెల్త్ సూపర్వైజర్లు రమా, సతీష్ బాబు మాట్లాడుతూ.. ఇది పిల్లల్లో ఊపిరితిత్తుల్లో వచ్చే ఇన్ఫెక్షన్ అని తెలిపారు. న్యుమోనియా వచ్చేందుకు ప్రధాన కారకాలు తల్లిపాలు సరిగా పట్టించకపోవడం, పోషకాహార లోపం, తదితర కారణాలు ఉన్నాయాన్నారు.