వణువులమ్మ అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే

వణువులమ్మ అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే

కోనసీమ: అంబాజీపేటలో ఉన్న వణువులమ్మ తల్లి అమ్మవారికి ఆషాఢ మాసం సందర్భంగా భక్తులు మంగళవారం సారె సమర్పించారు. ఈ కార్యక్రమంలో పి. గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... అమ్మ వారి ఆశీస్సులు నియోజకవర్గ ప్రజలందరికీ ఎల్లప్పుడూ ఉండాలని కోరుకున్నట్లు పేర్కొన్నారు.