జమ్మూకశ్మీర్లో భద్రతా బలగాల ఉగ్రవేట

జమ్మూకశ్మీర్లో భద్రతా బలగాల ఉగ్రవేట కొనసాగుతోంది. కఠువా జిల్లాలో ఉగ్రవాదుల కదలికలు ఉన్నాయనే సమాచారం బలగాలకు లభించింది. దీంతో వెంటనే ఆ ప్రాంతంలో సోదాలు చేపట్టారు. ఉదయం నుంచి CRPF, ఆర్మీ, పోలీసులు సంయుక్తంగా తనిఖీలు చేస్తున్నారు. ఈ సోదాలపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.