ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరాలి: ఎమ్మెల్యే జీవీ

GNTR: 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రతి ఇంటిపై జాతీయ జెండాను రెపరెపలాడించాలని ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం పిలుపుమేరకు నిర్వహించిన హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా 150 మీటర్ల జాతీయ జెండాతో భారీ ర్యాలీ నిర్వహించారు. భారత దేశానికి స్వాతంత్రం తీసుకురావడానికి ఎందరో మహానుభావులు నెలకొరిగారని తెలిపారు.