విద్యుత్ షాక్తో రైతు మృతి

విద్యుత్ షాక్తో రైతు మృతి

MDK: నర్సాపూర్ మండలంలోని లింగాపూర్ గ్రామంలో విషాదం నెలకొంది. లాలుతాండాకు చెందిన దేవసోత్ శంకర్ అనే రైతు తన పొలం వద్ద బోరు వైర్లు సరిచేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్కు గురై అక్కడికక్కడే మృతి చెందారు. గమనించిన స్థానికులు వెంటనే ఆయనను నర్సాపూర్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.