ప్రభుత్వ భూమి కాపాడిన హైడ్రా.. అసలేం జరిగింది.?

ప్రభుత్వ భూమి కాపాడిన హైడ్రా.. అసలేం జరిగింది.?

మేడ్చల్: గాజులరామారంలోని భగత్‌సింగ్ నగర్‌లో 2,000 గజాల ప్రభుత్వ భూమిని హైడ్రా కాపాడింది. ఆసుపత్రి, ఇతర ప్రజావసరాల కోసం కేటాయించిన ఈ భూమి పై కబ్జా ప్రయత్నం నేపథ్యంలో హైడ్రా పరిశీలించి, చుట్టూ కంచె వేసింది. 2021లో రూ.26.8 లక్షలు మంజూరై భాగంగా ప్రహరీ నిర్మాణం ప్రారంభమై కొనసాగలేకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. స్థానికులు హైడ్రా చర్య పై హర్షం వ్యక్తం చేశారు.