శ్రీశైలంలో సాంస్కృతిక కార్యక్రమాలు

KNL: శ్రీశైల దేవస్థానం ఆలయ దక్షిణ మాడవీధిలోని నిత్య కళారాధన వేదికపై కళాకారులచే సాంప్రదాయ నృత్యం ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో కళాకారులు మహాగణపతి, శివతాండవం, గీతాలకు, అష్టకాలకు సాంప్రదాయంలో ప్రదర్శించారు. స్వామి అమ్మవార్లకు ఆయా కైకార్యాలన్ని పరిపూర్ణంగా జరపాలని ప్రాచీన కళలు పరిరక్షణలో భాగంగా ప్రతినిత్యం నిత్య కళారాధన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.