నేడు నరసాపురంలో స్మార్ట్ రైస్ కార్డుల పంపిణీ

W.G: రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన క్యూఆర్ కోడ్ ఆధారిత స్మార్ట్ రైస్ కార్డుల పంపిణీ కార్యక్రమం మంగళవారం ప్రారంభిస్తున్నట్టు మొగల్తూరు తహసీల్దార్ కె. రాజ్ కిషోర్ ఓ ప్రకటనలో తెలిపారు. నియోజకవర్గ స్థాయిలో నరసాపురం తెలగా కళ్యాణ మండపంలో ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బొమ్మిడి నాయకర్ చేతులు మీదుగా పంపిణీ ప్రారంభిస్తామని పేర్కొన్నారు.