చెరువుకు సాగునీరు అందించడానికి కృషి చేస్తా: బండారు శ్రావణి

చెరువుకు సాగునీరు అందించడానికి కృషి చేస్తా: బండారు శ్రావణి

ATP: నార్పల మండలం బి.పప్పూరు చెరువును బుధవారం శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి పరిశీలించారు. గ్రామస్థులతో కలిసి రైతుల సమస్యలు తెలుసుకున్నారు. హల్క్ నీటితో చెరువు నింపితే పంటలు పండించుకోవడానికి అనువుగా ఉంటుందని వివరించారు. సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి చెరువుకు నీరు నింపడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.